శివుడు, విష్ణువుకి ప్రీతికరమైన కార్తీకమాసం 2024
న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం
నచవేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్థమమ్
కార్తీకమాసంలో సోమవారం, జ్వాలాతోరణం ..పరమేశ్వరుడి ప్రాముఖ్యత తెలియజేస్తే.. బలిపాడ్యమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి శ్రీ మహావిష్ణువు ప్రాముఖ్యత తెలియజేస్తున్నాయ్. కార్తీకపురాణంలో మొదటి 15 అధ్యాయాలు పరమేశ్వరుడి ప్రాముఖ్యత, చివరి 15 అధ్యాయాలు విష్ణువు గురించి తెలియజేస్తున్నాయ్. ఈ ఏడాది నవంబరు 02 నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతోంది. డిసెంబరు 01 తో ముగుస్తోంది.
మరిన్ని వివరాల కోసం లేదా పూజ బుక్ చేసుకోవడానికి సంప్రదించండి – 9391197279
దీపావళి అమావాస్యతో ఆశ్వయుజమాసం ముగుస్తుంది. ఆ మర్నాటి నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతుంది. అయితే ఈ ఏడాది అమావాస్య తిథి తగులు మిగులు రావడంతో అక్టోబరు 31 న దీపావళి వచ్చింది. నవంబరు 1 సూర్యోదయానికి అమావాస్య ఉండడంతో.. నవంబరు 2 నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతోంది.
బ్రహ్మ ముహూర్తంలో కార్తీకస్నానం, దీపంతో కార్తీకమాసం ప్రారంభిస్తారు. సుర్యోదయానికి పాడ్యమి తిథి ఉన్న రోజునే కార్తీకమాసం ప్రారంభంగా పరిగణలోకి తీసుకుంటారు. అందుకే నవంబరు 02 న కార్తీకమాసం ప్రారంభమవుతోంది.
కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!
2024 నవంబరు 02 శనివారం కార్తీకమాసం ప్రారంభం పాడ్యమి
నవంబరు 03 ఆదివారం యమవిదియ – భగినీహస్త భోజనం -భాయ్ దూజ్
నవంబరు 04 కార్తీకమాసం మొదటి సోమవారం
నవంబరు 05 మంగళవారం నాగులచవితి
నవంబరు 06 బుధవారం నాగపంచమి
నవంబరు 09 శనివారం కార్తావీర్యజయంతి
నవంబరు 11 కార్తీకమాసం రెండో సోమవారం – యజ్ఞావల్క జయంతి
నవంబరు 12 మంగళవారం మతత్రయ ఏకాదశి
నవంబరు 13 బుధవారం క్షీరాబ్ది ద్వాదశి
నవంబరు 15 శుక్రవారం జ్వాలా తోరణం, కార్తీక పూర్ణిమ (Karthika Pournami 2024), కేదారనోములు,గురునానక్ జయంతి
నవంబరు 16 శనివారం వృశ్చిక సంక్రాంతి
నవంబరు 18 కార్తీమాసం మూడో సోమవారం
నవంబరు 19 మంగళవారం సంకటహర చతుర్థి
నవంబరు 25 కార్తీకమాసం నాలుగో సోమవారం
నవంబరు 26 మంగళవారం ఏకాదశి
నవంబరు 29 శుక్రవారం మాస శివరాత్రి
నవంబరు 30 శనివారం అమావాస్య తగులు
డిసెంబరు 01 ఆదివారం అమావాస్య మిగులు – పోలిస్వర్గం
మరిన్ని వివరాల కోసం లేదా పూజ బుక్ చేసుకోవడానికి సంప్రదించండి - 9391197279
0 Comments